ఈ నెలలో స్టాక్ మార్కెట్లు 11 రోజుల పాటు పని చేయవు. కనుక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు అప్రమత్తం (బీవేర్)గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల రెండో తేదీ శుక్రవారం.. గుడ్ ఫ్రైడే.. కనుక స్టాక్ మార్కెట్లు పని చేయవు. మూడో తేదీన శనివారం, నాలుగో తేదీన ఆదివారం వారాంతపు సెలవులు.. తిరిగి స్టాక్ మార్కెట్లు సోమవారం అంటే ఐదో తేదీన మాత్రమే తెరుచుకుంటాయి.
వివిధ సెలవులు, రెగ్యులర్, వీక్లీ హాలీడేల వల్ల ఈ నెలలో 11 రోజులు స్టాక్ మార్కెట్లు పని చేయవు. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈలు శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈ నెల రెండో తేదీన మూసే ఉంటాయి. ఇక శనివారం (ఏప్రిల్ 3), ఆదివారం (ఏప్రిల్ 4) వారాంతపు సెలవులు. తిరిగి సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకుంటాయి.
గుడ్ ఫ్రైడే తర్వాత ఈ నెల 14వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. 21వ తేదీన (బుధవారం) శ్రీరామ నవమి నాడు సెలవు ఉంది.
ఏప్రిల్ మూడో తేదీ, నాలుగు, 10, 11, 17, 18, 24, 25 తేదీలు శని, ఆదివారాలు వారాంతపు సెలవు దినాలు కావడంతో స్టాక్ మార్కెట్లు పని చేయవు.
మహావీర్ జయంతి సందర్భంగా ఈ నెల 25వ తేదీన స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే, ఈ ఏడాది ఆదివారం రావడంతో ప్రత్యేకంగా సెలవు ఉండదు.
బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీల ట్రేడింగ్ ప్రతి రోజూ ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగుతుంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టెస్లాకు షాక్: విద్యుత్ వాహన రంగంలోకి షియోమీ
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్