జూన్ వరకూ.. వృద్ధుల ఎస్బీఐ వీకేర్ గడువు పొడిగింపు
ఎస్బీఐ వీకేర్| వృద్ధుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ వీకేర్ రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును వచ్చే జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురందించింది. వృద్ధుల కోసం అందుబాటులోకి తెచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్.. ఎస్బీఐ వీకేర్ రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును వచ్చే జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం గతేడాది మేలో ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ఎస్బీఐ తెచ్చింది.
తొలుత సెప్టెంబర్ వరకు గడువు పెట్టినా.. తర్వాత డిసెంబర్ వరకు, మూడోసారి 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించింది. బుధవారంతో ఆ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది.
కనుక సీనియర్ సిటిజన్లు ‘ఎస్బీఐ వీకేర్’ స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు సమయం లభిచింది. ఎస్బీఐ వీకేర్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. సాధారణంగా బ్యాంకుల్లో వృద్ధులు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి.
దీనిలో చేరితే సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 80 బేసిస్ పాయింట్లు (0.8 శాతం) వడ్డీ ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఐదేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5.40 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 ఏండ్ల కాలానికి డిపాజిట్ మొత్తంపై 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
‘ఎస్బీఐ వీకేర్ డిపాజిట్’ స్కీమ్‌లో చేరాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ /జాయింట్ అకౌంట్ ప్రారంభించొచ్చు. నామినేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.
ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. తొలుత ఐదేండ్లకు డిపాజిట్ చేసి, తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేండ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే 0.30 శాతం వడ్డీ నష్టపోవాల్సిందే. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయం పన్ను మినహాయింపులు ఉండవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చిప్‌ల కొరతతో ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌లు విలవిల
టెస్లాకు షాక్: విద్యుత్ వాహన రంగంలోకి షియోమీ
స్వల్పంగా పెరిగిన బంగారం.. సర్దుబాటలో వెండి
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
భర్త పుట్టింటికి తీసుకెళ్లలేదని పసిబిడ్డను పొడిచి చంపిన మహిళ..!
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్‌కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ప్రేమ పెండ్లి ప్రాణం తీసింది
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- sbi
- senior citizens
- we care
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

