Assam Rifles | అసోం రైఫిల్స్ దళాలపై ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
Assam Rifles : అరుణాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భద్రతా దళాల్లో కీలక విభాగమైన అసోం రైఫిల్స్ బృదాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
Assam Rifles : అరుణాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భద్రతా దళాల్లో కీలక విభాగమైన అసోం రైఫిల్స్ బృదాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్, చంగ్లాంగ్ జిల్లాలో ఇండియా-మయన్మార్ సరిహద్దులో మంగళవారం జరిగింది.
ఉదయం 6.30 గంటల సమయంలో 21 అసోం రైఫిల్స్ బృందానికి చెందిన జవాన్లు నాంపోంగ్ నల్లా ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇది ఇండియా-మయన్మార్ సరిహద్దు కావడంతో ఇక్కడ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తనిఖీ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఉన్నట్లుండి అసోం సైనిక దళాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హవిల్దార్ జంఖోకాయ్ కుకి (42) అనే జవాన్ మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో భారీ స్తాయిలో మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్ఎస్సీఎన్ (కే-వైఏ) అనే ఉగ్రవాద సంస్థ ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

