ముంబై : ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు గాల్ బ్లాడర్‌కు(పిత్తాశయానికి) సంబంధించిన శస్ర్త చికిత్స విజయవంతమైనట్లు మహారాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. పిత్తాశయం నుంచి రాళ్లను విజయవంతంగా తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.
పవార్ ఆదివారం సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో బాధపడటంతో ముంబై బ్రీచ్ కాండీ దవాఖానలో చేరారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. పిత్తాశయ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పవార్‌కు వైద్యులు ఎండోస్కోపీ, శస్త్రచికిత్స నిర్వహించి రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
Sharad Pawar ji is doing well after the operation. Stone has been removed from the Gallbladder successfully: Maharashtra Health Minister Rajesh Tope (30.03) pic.twitter.com/5p68FrEB7p
— ANI (@ANI) March 30, 2021
ఇవి కూడా చదవండి..