తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పేరున్న ఇండియన్ ఐడల్ అనే మ్యూజిక్ రియాలిటీ షోలో పాల్గొంటుంది. ప్రస్తుతం 12వ సీజన్ నడుస్తుండగా, తాజాగా ఈ షో నుండి అంజలి గైక్వాడ్ అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. అయితే పాపులర్ నటి జీనత్ అమన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని వేడుకగా జరుపాలని భావించిన నిర్వాహకులు కంటెస్టెంట్స్ చేత ఆమె కెరీర్ లోని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని పాడించారు. జీనత్ అమన్ మరుపురాని పాటల్లో ఒకటైన ‘చురాలీయా హై తుమ్నే జో దిల్ కో’ గీతాన్ని మన షణ్ముఖ ప్రియ ఆలపించింది.
‘యాదోంకీ బారాత్’ సినిమాలోని చురాలీయా హై తుమ్నే జో దిల్ కో పాటని ఆశా భోంస్లే పాడగా, ఆర్ డీ బుర్మాన్ స్వరాలు సమకూర్చారు. ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపగా, ఇందులో జీనత్ ఓ వెస్ట్రన్ ఔట్ ఫిట్ ధరిస్తుంది. సరిగ్గా అటువంటిదే షణ్ముఖప్రియ కూడా ధరించి పాడింది. ఇది చూసి జీనత్ అమన్ మురిసిపోయారు. ‘బేబీ జీనత్’ అంటూ కితాబునిచ్చారు. అందుకు ప్రతిగా, షణ్ముఖప్రియ కూడా లెజెండ్రీ యాక్ట్రస్ కు థాంక్స్ చెబుతూనే ‘ఇండియన్ ఐడల్’ తనకు ఎంతో గొప్ప అవకాశాన్ని అందించిందనీ అభిప్రాయపడింది. అయితే షణ్ముఖ ప్రియ చురాలీయా హై తుమ్నే జో దిల్ కో పాటని తనదైన స్టైల్లో పాడగా, అది నెటిజన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమెని నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. ఈ విషయం గురించి ఇండియన్ ఐడల్ హోస్ట్ ఆదిత్య నారాయణ్, జీనత్ మధ్య చర్చకు వచ్చినప్పుడు షణ్ముఖ ప్రియ కన్నీరు పెట్టుకుంది. వెంటనే జీనత్.. దయచేసి ఏడవకు షణ్ముఖ. నువ్వు చాలా స్పెషల్. నీ టాలెంట్ నీకు తెలుసు. ఏది మనసుకు తీసుకోవద్దు. ప్రజలు పలు కామెంట్స్ చేస్తారు. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు అని జీనత్ .. షణ్ముఖని ఓదార్చే ప్రయత్నం చేసింది.
Whenever #ShanmukhaPriya comes to sing. #IndianIdol2021 pic.twitter.com/0W1tRtzpxX
— AFwaN (@afwanlefthander) June 6, 2021
#IndianIdol2021 Please eliminate #ShanmukhaPriya from the show, she make the song to the worst.
— Sanjay Karampuri (@KarampuriSanjay) June 6, 2021
Best shows we have seen but with #ShanMukhPriya & #danish it's very worst to watch the show. Even if we love it!
After listening to #ShanmukhaPriya's Chura Liya.. #IndianIdol2021 #IndianIdol pic.twitter.com/cdw0yS0azs
— MB (@beingmb22) June 6, 2021