దేవరకొండ రూరల్, జనవరి 09 : దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో గురువారం రాత్రి భూతగాదాలు చోటుచేసుకున్నాయి. కడారి ఆంజనేయులు, కడారి బంగారయ్య కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి. వాగ్వాదం పెరిగి ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఇరువురి వ్యవసాయ భూమి పక్కపక్కన ఉండటంతో గెట్టు తగాదాలు తలెత్తి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సీఐ బీసన్న తెలిపారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.