రామన్నపేట, జనవరి 09 : కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ విద్యార్థి వి.శరణ్ తేజ్ అత్యుత్తమ విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో శరణ్ తేజ్ చేసిన ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి పొందిన శరణ్ తేజ్ ను, గైడ్ టీచర్ పి.మురళిని కామారెడ్డి ఎమ్మెల్యే కె.వెంకట రమణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, అధికారులు అభినందించి బహుమతి అందజేసినట్లు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.మణి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

Ramannapet : రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో కృష్ణవేణి విద్యార్థికి ప్రథమ బహుమతి