– భూదాన్ పోచంపల్లిలో రెండు ఈవీ పారిశుధ్య వాహనాలు ప్రారంభం
భూదాన్ పోచంపల్లి, జూలై 14 : ప్రజలకు పారిశుధ్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో రెండు ఈవీ పారిశుధ్య వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య సేవలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంతో రెండు ఈవీ పారిశుధ్య వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రజల భాగస్వాములు అవసరమని అన్నారు.
పారిశుధ్య వాహనాల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ వ్యర్ధాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగి పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ కొయ్యడ రజని శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీరామ్ మంజుల, కొండమడుగు ఎల్ల స్వామి, రావుల జంగయ్య, పెద్దల చక్రపాణి, బాతుక లింగస్వామి, కర్నాటి వరలక్ష్మి నరసింహ, రాపోలు కావ్య వేణు, దేవరాయ కుమార్, జింకల లావణ్య యాదగిరి, కుడికాల అఖిల, సురపల్లి రాధిక రమేష్, కో ఆప్షన్లు మద్ది మధుసూదన్ రెడ్డి, ఎజాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పు నూతుల వెంకటేష్ యాదవ్, నాయకులు పాక మల్లేష్ యాదవ్, కొట్టం కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

మరింత మెరుగ్గా పారిశుధ్య సేవలు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి