మద్దూరు : ఇంటర్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది.
కాలేజీలోని ఓ విద్యార్థిని కళాశాల భవనం రెండో అంతస్తు పైనుంచి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వెంటనే సదరు బాలికను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.