మాగనూరు, జనవరి 6 : మాగనూరు మండలం గజరందొడ్డి వాగులో టీజీఎండీసీ ఇసుక తరలింపును మక్తల్ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకొని ఇసుక తరలింపు నిలిపివేశారు. చిట్యాల, గజరందొడ్డి గ్రామాల మధ్య ఉన్న వాగు 60,70 ఫీట్ల వెడ ల్పు మాత్రమే ఉందని అకడి నుం చి ఇసుక తరలిస్తే రైతులకు ముందుముందు సాగునీరుకు ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని గ్రామస్తు లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇ సుక తరలించేందుకు ట్రిప్పర్లను వా గులోకి దించగా చిట్యాల గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వాగులోకి చేరుకొని ఇసుక నింపుతున్న ట్రిప్పర్లను అడ్డుకొని అకడే ఖాళీ చేయిం చి వచ్చిన ఇసుక ట్రిప్పర్లను సైతం తిరిగి పంపించారు.
దీంతో అకడ చిట్యాల గ్రామస్తులు మధ్య మందిపల్లి గ్రామస్తుల మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా మందిపల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డిపై చిట్యాల గ్రామస్తులు చేయి చేసుకొని చంపుతామంటూ బెదిరించినట్లు అనంతరెడ్డితో పాటు పలువురు మందిపల్లి గ్రామస్తులు అక్కడికి వచ్చిన మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మితో తమ బాధ ను వెల్లిబుచ్చుకున్నారు. అయితే మాగనూరు శివారు లో గొడవ జరిగింది కాబట్టి మాగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్సై అనంతరెడ్డితో చెప్పారు. ఇసు క తరలింపును అడ్డుకోవడానికి వచ్చిన చిట్యాల గ్రామస్తులతో మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇ సుక తరలింపును అడ్డుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఆ దేశాల మేరకు ఇసుక తరలిస్తారని చిట్యాల గ్రామస్తుల కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా ఇసుక టి ప్పర్లను బయటకు పంపి ఇసుక తరలింపు కోసం వేసిన రోడ్డు సైతం తవ్వారు. అనంతరం మాగనూరు పోలీసు లు ఇసుక రీచ్‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.