Sand Mafia | మాగనూరు (కృష్ణ), సెప్టెంబర్ 23 : అధికారులు ఇసుక సీజ్ చేస్తే.. ఇసుక మేము తరలిస్తామంటూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న సంఘటన కృష్ణ మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సాధారణంగా ఇసుక అక్రమ రవాణా చేసి డంపులు చేస్తే రెవెన్యూ అధికారులు వాటిని సీజ్ చేసి ఇసుకకు వేలం వేసి, వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ.
అయితే దీనికి విరుద్ధంగా కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది దృష్టికి వెళ్లడంతో ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక డంపులు సీజ్ చేశాడు. అయితే ఎవరైతే ఇసుక డంపు చేశారో వారిని కృష్ణ తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని ఇసుక డంపు తీసుకెళ్లాలంటే 50వేల రూపాయలు ఫైన్ కట్టి ఇసుక తీసుకెళ్లాలని తాసిల్దార్ సూచించారు.
అయితే ఇసుక మాఫియా మాత్రం రాత్రికి రాత్రి సీజ్ చేసిన ఇసుకను ట్రిప్పర్ల ద్వారా ఇసుక తరలించి మీరు సీజ్ చేస్తే మేము ఇసుక తీసుకెళ్లలేమా అంటూ రెవెన్యూ సిబ్బందికి సవాలు విసురుతున్నారు. ఈ విషయంలో కృష్ణ రెవెన్యూ సిబ్బంది హస్తంతోనే అక్రమ ఇసుక తరలించారని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులును పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి