తుంగతుర్తి, జూన్ 03 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో షాపులో మంటలు చెలరేగి షాప్ మొత్తం అగ్నికి ఆహుతి అయింది, దీంతో తనకు సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.