ముంబై, మే 1: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు అనుజ్ థపన్ (23) లాకప్‌లోని టాయిలెట్లో బెడ్‌షీట్‌తో బుధవారం ఉరేసుకున్నాడు.
పోలీసులు అతడిని సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దక్షిణ ముంబైలోని మైదాన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. ముంబైలోని సల్మాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన విక్కీగుప్తా, సాగర్పాల్కు ఆయుధాలు సరఫరా చేసిన ఆరోపణలపై పంజాబ్‌లో సోనుకుమార్ బిష్ణోయ్‌తోపాటు అనుజ్ థపన్ను అరెస్టు చేశారు.