Driving At 160 kmph | 160 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవ్.. లైవ్లో చూపిస్తూ ప్రమాదంలో నలుగురు మృతి
Driving At 160 kmph | కారులో ప్రయాణించిన ఐదుగురు యువకులు సందడి చేశారు. వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్లో చూపించారు. వరుసగా వాహనాలను డ్రైవర్ దాటి వెళ్లడంతో అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. చివరకు ఆ కారు ప్రమాదంలో నలుగురు మరణించారు.
అహ్మదాబాద్: కారులో ప్రయాణించిన ఐదుగురు యువకులు సందడి చేశారు. వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్లో చూపించారు. (Driving At 160 kmph) వరుసగా వాహనాలను డ్రైవర్ దాటి వెళ్లడంతో అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. చివరకు ఆ కారు ప్రమాదంలో నలుగురు మరణించారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవ్ చేసిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. గుజరాత్లోని వాసద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 2న అర్ధరాత్రి తర్వాత 22 నుంచి 27 ఏళ్ల వయస్సున్న ఐదుగురు స్నేహితులు అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై కారు 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లడాన్ని ఇన్స్టాగ్రామ్ లైవ్లో చూపించి కేరింతలు కొట్టారు.
కాగా, రోడ్డుపై వాహనాలను కారు డ్రైవర్ వేగంగా దాటడంతో స్నేహితులు అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. అయితే ఒక వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆ కారు ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు స్నేహితుల్లో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.
మరోవైపు కారు డ్రైవ్ చేసిన ముస్తఫా అలియాస్ షహబాద్ ఖాన్ పఠాన్ గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు ప్రమాదంలో నలుగురి మృతికి ముందు ఇన్స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
It's painful to see these young boys risking their own and others' lives for attention and what they call "bhaukaal"
As per details –
This accident happend in Vasad ( GJ )
Unfortunately, 4 out of 5 passengers died while the driver sustained some injuries.
A case has been… pic.twitter.com/4ZzoBdjOwV— Prateek Singh (@Prateek34381357) May 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

