Hostel Girl Raped | హాస్టల్లో బాలికపై అత్యాచారం.. స్కూల్ యజమాని అరెస్ట్
Hostel Girl Raped | హాస్టల్లో బాలికపై అత్యాచారం జరిగింది. బాధిత బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వారాలకుపైగా దర్యాప్తు చేశారు. చివరకు స్కూల్ యజమాని అరెస్ట్ అయ్యాడు. కేసు నమోదు చేయవద్దని బాధితురాలి తల్లిపై ఒత్తిడి తెచ్చి సస్పెండైన పోలీస్ అధికారిని కూడా అరెస్ట్ చేశారు.
భోపాల్: హాస్టల్లో బాలికపై అత్యాచారం జరిగింది. (Hostel Girl Raped) బాధిత బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వారాలకుపైగా దర్యాప్తు చేశారు. చివరకు స్కూల్ యజమాని అరెస్ట్ అయ్యాడు. కేసు నమోదు చేయవద్దని బాధితురాలి తల్లిపై ఒత్తిడి తెచ్చి సస్పెండైన పోలీస్ అధికారిని కూడా అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. 8 ఏళ్ల బాలిక ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ఆ స్కూల్ హాస్టల్లో ఆ బాలిక ఉంటున్నది.
కాగా, తనపై అత్యాచారం జరిగినట్లు ఆ బాలిక ఆరోపించింది. దీంతో ఏప్రిల్ 30న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం సీఎం మోహన్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఫిర్యాదు చేయవద్దని బాధిత బాలిక తల్లిపై ఒత్తిడి చేసిన ఎస్ఐ ప్రకాష్ సింగ్ రాజ్‌పుత్‌ను సస్పెండ్ చేశారు.
మరోవైపు స్కూల్ హాస్టల్లో బాలికపై అత్యాచారం కేసును దర్యాప్తు చేసిన సిట్ పోలీసులు చివరకు ఆ స్కూల్ యజమానిని మంగళవారం అరెస్ట్ చేశారు. అలాగే బాధిత బాలిక తల్లిపై ఒత్తిడి చేసి సస్పెండైన ఎస్ఐ ప్రకాష్ సింగ్ రాజ్‌పుత్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ శ్రద్ధా తివారీ తెలిపారు. కేసులోని మిగతా ఇద్దరు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

