బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. స్టార్ డబుల్స్ పెయిర్ సాత్విక్-చిరాగ్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లగా సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్స్ సాత్విక్-చిరాగ్.. 21-13, 21-14 తేడాతో మలేషియా ద్వయం మహ్మద్ అజ్రిన్ అయూబ్-తాన్ వీ కియోంగ్ కథను 34 నిమిషాల్లోనే ముగించారు.
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన యువ సంచలనం మీరబ లువాంగ్.. 21-19, 21-18తో ప్రణయ్‌కు షాకిచ్చాడు. కిరణ్ జార్జి 15-21, 21-13, 17-21 తో క్రిస్టోఫెర్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు. ప్రిక్వార్టర్స్‌లో లువాంగ్.. క్రిస్టోఫెర్సెన్‌తో తలపడాల్సి ఉంది. మహిళల సింగిల్స్‌లో అష్మిత చాహిల.. 19-21, 21-15, 21-14 తో ఈస్టర్ నురుమి (ఇండోనేషియా)ను ఓడించింది. మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు.