Rural Agricultural work | తొగుట, ఆగస్టు 18 : తొగుట మండల పరిధిలోని గుడికందుల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహించారు. బీఎస్సీ అగ్రికల్చర్ 4వ సంవత్సరం విద్యార్థులు గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సుని (పీఆర్ఏ) రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ ఏఈఓ దేవేందర్ రెడ్డి, గ్రామ రైతుల నుండి సమాచారం సేకరించారు. గ్రామం సామాజిక, వనరుల పటాన్ని గీసి వివరించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కాలచక్రం, మాత్రిక్సీ ర్యాంకింగ్ , చపాతీ పాఠం, సీజనల్ కేలండర్తోపాటు వివిధ రకాల పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్సీ తోర్నాల సైంటిస్ట్ పల్లవి, బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవి , గుడికందుల ఏఈఓ దేవేందర్ రెడ్డి, అభ్యుదయ రైతులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.
వ్యవసాయ సాగులో ఉన్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. గ్రామంలోని రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో నాగ స్రవంతి, మనసా, ఆకాంక్ష, మాలిని, శ్రావణీ, సవ్య తదితరులు పాల్గొన్నారు.
Kodangal | అంబులెన్స్ లేక మృతదేహాన్ని తోపుడుబండిలో తరలించిన పోలీసులు.. సీఎం ఇలాకాలో అమానవీయం
Tadipatri | జేసీ ప్రభాకర్ రెడ్డి ఈవెంట్ వల్లే కేతిరెడ్డిని అడ్డుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Thorrur | యూరియా కోసం రైతుల బారులు.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైన కష్టాలు