ప్లాట్‌ఫాం టికెట్ రేటు పెంచారు : 150 కోట్ల ఆదాయం కోల్పోయారు
రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం రైల్వేలకు నష్టం తీసుకొచ్చింది. ప్లాట్‌ఫాం టికెట్ల రేట్లను అమాంతం పెంచడం వల్ల రైల్వే శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ముంబై : రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం రైల్వేలకు నష్టం తీసుకొచ్చింది. ప్లాట్‌ఫాం టికెట్ల రేట్లను అమాంతం పెంచడం వల్ల రైల్వే శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఆదాయం రూ.10 కోట్లు మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ద్వారా రూ.160 కోట్లు సంపాదించింది.
సమాచార హక్కు (ఆర్టీఐ) కింద ఒక కార్యకర్త అడిగిన మేరకు ఈ సమాచారం రైల్వే శాఖ ఇచ్చింది. ప్లాట్‌ఫాం టికెట్ల అమ్మకాలను నిలిపివేయడం వల్ల ఆదాయంలో 94 శాతం కోల్పోయిందని తెలిపింది. కరోనా కారణంగా రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా నిలువరించేందుకు ప్లాట్‌ఫాం టికెట్‌ను మొదట రూ.50 గా నిర్ణయించారు. అనంతరం దాన్ని కూడా నిలిపివేశారు. 2020-21లో ప్లాట్‌ఫాం టికెట్ల ద్వారా కేవలం రూ.10 కోట్లు మాత్రమే సంపాదించినట్లు రైల్వే తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ద్వారా రూ.160.87 కోట్లు సంపాదించింది. ఈ సంపాదన గత 5 సంవత్సరాలలో ఈ విభాగంలో అత్యధికం.
కొన్ని డివిజన్ల పరిధిలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంచగా.. మరికొన్ని డివిజన్లలో ప్రవేశాలను పూర్తిగా నిషేధించారు. ప్లాట్‌ఫాం టికెట్‌ను ఇంతకు ముందు రూ.10 నుంచి 30 కి ధర నిర్ణయించారు. అయినప్పటికీ జనం ఆగకపోవడంతో దానిని రూ.50 కి పెంచారు. కొవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత పాత ధరలను అమలుచేస్తామని రైల్వే చెప్తున్నది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి : నేషనల్ కాన్ఫరెన్స్
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
బహు భార్యత్వానికి మద్దతు.. లా ప్రొఫెసర్‌కు ఇక్కట్లు
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
గెలుపు కోసం : యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ..?
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

