పవన్ కల్యాణ్ లైటిల్రోల్లో నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. నైజాం ఏరియా (Nizam record ) లో ఓపెనింగ్ డేన భీమ్లా నాయక్ రికార్డు స్థాయిలో హయ్యెస్ట్ షేర్ అంటే రూ.11.80 కోట్లు రాబట్టింది. ఇక ఈ రికార్డును భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) సులభంగా కొల్లగొట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు ధీమాగా చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును మామూలుగా ఓవర్ టేక్ చేయడమే కాదు..రెట్టింపు స్థాయిలో అంటే సుమారుగా రూ.24 కోట్లకుపైగా కలెక్ట్ చేయబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ తొలిరోజు నైజాంలో రూ.25 కోట్లు కనుక వసూళ్లు చేస్తే ఇంతకు ముందు ఉన్న రికార్డు బద్దలు కొట్టినట్టే. మరి భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టు భీమ్లానాయక్ రికార్డును అధిగమించడం ఈజీగా జరిగిపోనుందని తెలుస్తోండగా..మరికొన్ని గంటల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఆర్ఆర్ఆర్ అనుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు అన్ని థియేటర్లలో తన హవా ప్రదర్శిస్తూ స్క్రీనింగ్ అవుతోంది. ఈలలు, కేకలు, అరుపులు, టపాసుల మోతతో థియేటర్ల ప్రాంగణాలు మార్మోగిపోతున్నాయి.