IND vs ENG 3rd Test | అర్థశతకంతో ఆదుకున్న హిట్‌మ్యాన్.. లంచ్ సమయానికి స్కోర్..?
IND vs ENG 3rd Test : మూడో టెస్టులో రోహిత్ శర్మ(52) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ క్రీజులో పాతుకుపోయి హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ నిప్పులు చెరుగుతున్నా.. పట్టుదలగా క్రీజులో నిలబడి హాఫ్ సెంచరీ...
IND vs ENG 3rd Test : మూడో టెస్టులో రోహిత్ శర్మ(52 నాటౌట్ : 74 బంతుల్లో 8 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ క్రీజులో పాతుకుపోయి హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ నిప్పులు చెరుగుతున్నా.. పట్టుదలగా క్రీజులో నిలబడి హాఫ్ సెంచరీ సాధించాడు.
టామ్ హర్ట్లే బౌలింగ్‌లో రెండు పరుగులు తీసిన హిట్‌మ్యాన్ కెరీర్లో 17వ అర్ధ శతకం నమోదు చేశాడు. నాలుగో వికెట్‌కు రవీంద్ర జడేజా(24 నాటౌట్) కలిసి 60 పరుగులు జోడించాడు. దాంతో, టీమిండియా లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
That’s Lunch on Day 1 of the third #INDvENG Test!
An unbeaten 6⃣0⃣-run stand between captain @ImRo45 & @imjadeja! 🤝
We will be back for the Second Session shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/EW1kfG55HN
— BCCI (@BCCI) February 15, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. వైజాగ్ టెస్టులో డుబ్ సెంచరీతో మెరిసిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు. స్లిప్‌లో జో రూట్ చక్కని క్యాచ్ పట్టడంతో యశస్వీ డగౌట్‌కు చేరాడు. ఆ తర్వాత మరో సూపర్ డెలివరీ వేసిన వుడ్.. శుభ్‌మన్ గిల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. వైజాగ్ టెస్టులో ఆకట్టుకున్న రజత్ పాటిదార్(5)ను టామ్ హర్ట్లే ఔట్ చేసి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
రోహిత్ శర్మ(52 నాటౌట్)

దాంతో, 33 పరుగులకే మూడు కీలక వికెట్లు పడడంతో ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే.. రోహిత్ తన సహజ ఆటను పక్కనపెట్టి నిదానంగా ఆడుతూ.. జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో, తొలి సెషన్లో మరో వికెట్ తీసేందుకు స్టోక్స్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది.
ఇవి కూడా చదవండి
- TS Polycet | టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. మే 17న రాతపరీక్ష
- SK23 | క్రేజీ కాంబో.. మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్.. షూటింగ్ ప్రారంభం
- IND vs ENG 3rd Test | రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. స్కోర్ ఎంతంటే..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

