IND vs ENG 3rd Test | రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. స్కోర్ ఎంతంటే..?
IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(51 నాటౌట్) హాఫ్ సెంచరీ కొట్టాడు. టామ్ హర్ట్లే బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఇంగ్లండ్ పేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్న రోహిత్...
IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(51 నాటౌట్) హాఫ్ సెంచరీ కొట్టాడు. టామ్ హర్ట్లే బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఇంగ్లండ్ పేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్న రోహిత్ 71 బంతుల్లో 8 ఫోర్లతో అర్ద శతకం సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికి ఇది 17వ హాఫ్ సెంచరీ.
33 పరుగులకే మూడు వికెట్లు పడిన జట్టును సాధికారిక ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్ ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు రవీంద్ర జడేజా(17) కలిసి 48 పరుగులు జోడించాడు. దాంతో, టీమిండియా 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.
5⃣0⃣ for captain Rohit Sharma! 👏 👏
His 17th Test fifty as #TeamIndia move past 80.
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/RIMzEEna97
— BCCI (@BCCI) February 15, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ విజృంభించడంతో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)తో పాటు శుభ్‌మన్ గిల్(0) పెవిలియన్ చేరారు. ఆ కాసేపటికే రజత్ పాటిదార్()ను టామ్ హర్ట్లే ఔట్ చేసి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన లోకల్ బాయ్ జడేజా క్రీజులో నిలదొక్కుకున్నాడు. రోహిత్, జడ్డూలు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్‌ను పోటీలో నిలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

