CPM | సీఎం రేవంత్ రెడ్డికి కామ్రేడ్లు బిగ్ షాక్.. భువనగిరిలో తగ్గేదేలే అంటున్న సీపీఎం
CPM | రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పనితీరుపై సీపీఎం(CPM party) పార్టీకి తత్వం బోధపడినట్లుంది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పనితీరుపై సీపీఎం(CPM party) పార్టీకి తత్వం బోధపడినట్లుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు తెగ తాపత్రయపడిన ఆ పార్టీకి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ చూపించింది. చివరి వరకు వేచి ఉంచి టికెట్ల విషయంలో పీటముడి వేసి పొత్తు విచ్ఛిన్నం అయ్యేలా చూసింది. దీంతో సీపీఎం ఒంటరిగానే పోటీలో నిలబడింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అవడంతో ఆ పార్టీ కళ్లు తెరిచింది.
ఎన్నికల్లో పొత్తు కుదరకపోవడంతో భువనగిరిలో(Bhuvanagiri) ఒంటరిగానే పోటీలో నిలిచింది. అయితే సీపీఎం భువనగిరి అభ్యర్థి జహంగీర్‌ను పోటీ నుంచి ఉపసంహరించుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరికను కామ్రేడ్లు తోసిపుచ్చారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని బృందంతో తన నివాసంలో సమావేశమయ్యారు. దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
అందుకు సరేనన్న సీపీఎం భువనగిరిలో మాత్రం తమకు మద్దుతు ఇవ్వాలని సూచించింది. దీనికి సీఎం అంగీకరించలేదు. దీంతో సీపీఎం సీఎం వినతిని తోసిపుచ్చింది. మిగిలిన 16 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తామని, కానీ భువనగిరి బరిలో కొనసాగుతామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
కామ్రేడ్ల ఊహించని షాక్‌తో సీఎంకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనయిందని పలువురు చర్చిం చుకుంటున్నారు. మిగతా చోట్ల పోటీ ఎలా ఉన్నా భువనగిరిలో కాంగ్రెస్‌కు మిత్రపక్షాల నుంచి పోటీ తప్పేలా లేదు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

