ముంబై: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ రిషబ్ పంత్, అశ్విన్, రహానే బాక్స్ క్రికెట్ ఆడారు. ఓ యాడ్ షూటింగ్ చేస్తూ మధ్యలో బ్రేక్ దొరకడంతో ఈ ముగ్గురూ సరదాగా బాక్స్ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ ఫ్రాంచైజీ ట్విటర్లో పోస్ట్ చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ బాల్ వేయగా రహానే దానిని మెల్లగా కొట్టాడు. పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకొని సెలబ్రేట్ చేసుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కెమెరా వైపు చూస్తు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌ను ట్యాగ్ చేయాల్సిందిగా పంత్ చెప్పాడు.
సాధారణంగా టెస్టుల్లో గిల్ అదే పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తుంటాడు. బహుషా అశ్విన్ పట్టిన క్యాచ్‌ను చూడాల్సిందిగా గిల్‌ను ట్యాగ్ చేయాలని పంత్ అడిగి ఉంటాడేమో అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఐపీఎల్లో భాగంగా ఈ నెల 10న చెన్నైతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. గాయంతో శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌కు దూరం కావడంతో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Breaks during a shoot are for box cricket, of course 😁🏏
— Delhi Capitals (@DelhiCapitals) April 4, 2021
Tagging @RealShubmanGill here because our skipper said so 😉#YehHaiNayiDilli @RishabhPant17 @ajinkyarahane88 @ashwinravi99 @TajMahalMumbai pic.twitter.com/An1RW1tkDo
ఇవి కూడా చదవండి
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు