Rhea Chakraborty | దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో నటి రియా చక్రవర్తి తన పాస్‌పోర్ట్‌ను దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి పొందింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణ నేపథ్యంలో రియాచక్రవర్తి పాస్‌పోర్ట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) 2020 స్వాధీనం చేసుకుంది.
అయితే ఇటీవలే బాంబే హైకోర్టు రియాచక్రవర్తి పాస్‌పోర్ట్‌ను తిరిగిచ్చేయాలని ఎన్సీబీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు రియా చక్రవర్తి పాస్‌పోర్టు తిరిగి అందుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద పాస్‌పోర్టును చేతిలో పట్టుకున్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రియా చక్రవర్తి. ‘గత ఐదేళ్లుగా కేవలం ఓపిక మాత్రమే నా పాస్‌పోర్ట్. లెక్కలేనన్ని యుద్దాలు.. అంతులేని నిరీక్షణ. నేడు నా పాస్‌పోర్ట్ మళ్లీ పొందాను. నా రెండో అధ్యాయానికి రెడీ.. సత్యమేవ జయతే’ అని క్యాప్షన్ ఇచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్‌ది ఆత్మహత్యగా పోలీసులు భావించారు. మరోవైపు సుశాంత్ తల్లిదండ్రులు మాత్రం అది ఆత్మహత్యకాదంటూ రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై కేసు పెట్టారు.
సుశాంత్‌కు రియా డ్రగ్స్‌కు ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంది. సుశాంత్ కేసులో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. అయితే ఇటీవలే ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తుది తీర్పును వెలువరిస్తూ రియాచక్రవర్తికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రియా చక్రవర్తికి అడ్డంకులు తొలిగిపోవడంతో తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందింది.
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!