వికారాబాద్, డిసెంబర్ 23 : దీక్షలతో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జీవితాలే కాదు.. లక్షకు పైగా విద్యార్థుల భవిష్యత్తు కూడా రోడ్డున పడుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన ఆర్డీవో కార్యాలయం వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యో గులు చేపట్టిన దీక్ష శిబిరం వద్దకు వెళ్లి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. రాజకీయ నాయకులు హామీలిచ్చే వారే కాని.. నెరవేర్చే వారు కాదు అన్న విధంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏన్నో ఏండ్లు గా విద్యాశాఖలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారివి గొంతెమ్మ కోర్కెలు కానే కా వని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదా లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు న్యా యం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉద్యోగులు 18 రోజులుగా దీక్షలు చేస్తున్నా సీఎం స్పందించపోవడం తగదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రామస్వామి, కృష్ణ, రాములు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, పురుషోత్తంరెడ్డి, నాయకు లు సత్యయ్యగౌడ్, గయాజ్, గఫార్, అశోక్, లక్ష్మణ్, శ్రీనివాస్, మల్లికార్జున్, మల్లేశ్, ఇస్మాయిల్, కాశయ్య, సుభాన్‌రెడ్డి, అనిల్, ప్రవీణ్‌కుమార్, కిశోర్, మహిపాల్, జైపాల్, శీను, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యో గులు రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. సోమ వారానికి 17వ రోజుకు చేరాయి. ఈ సంద ర్భంగా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ అజీజ్, ప్రధాన కార్యదర్శి సంపత్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తమ గురించి కనీ సం ఒక్క మాట కూడా చర్చించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తమను క్రమబద్ధీకరిం చడం తోపాటు తక్షణమే పే స్కేల్‌ను వర్తింపజేయాల ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు అధిక సంఖ్యలో పా ల్గొన్నారు. కాగా సోమవారం ఉద్యోగులు నిరసన తెలుపుతున్న స్థలంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.