నిడమనూరు, నవంబర్ 23 : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేశారు. మండలంలోని 29 పంచాయతీల రిజర్వేషన్లకు నిర్వహించిన డ్రాలో రిజర్వేషన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
బంకాపురం-జనరల్ , బంటువారి గూడెం-జనరల్ (మహిళ), బొక్కమంతల పహాడ్- ఎస్సీ జనరల్ , గుంటిపల్లి -జనరల్ (మహిళ), గుంటుక గూడెం -జనరల్ (మహిళ), ఇండ్లకోటయ్య గూడెం-బీసీ జనరల్, మార్లగడ్డ క్యాంపు -జనరల్, మారుపాక-ఎస్సీ జనరల్, ముకుందాపురం-జనరల్ (మహిళ), ముప్పారం-ఎస్సీ (మహిళ), నందికొండ వారి గూడెం-జనరల్, నారమ్మ గూడెం-జనరల్, నిడమనూరు-బీసీ (మహిళ); పార్వతీపురం-బీసీ (మహిళ); రాజన్నగూడెం-ఎస్సీ జనరల్ ; రేగులగడ్డ -ఎస్టీ జనరల్ ; శాఖాపురం-జనరల్ (మహిళ), సోమోరిగూడెం-జనరల్ (మహిళ), సూరేపల్లి-ఎస్సీ (మహిళ), తుమ్మడం-బీసీ జనరల్ , వడ్డెర గూడెం-జనరల్ (మహిళ), వల్లభాపురం-బీసీ జనరల్ , వేంపాడ్-బీసీ జనరల్ , వెంగన్న గూడెం-బీసీ (మహిళ), వెనిగండ్ల -జనరల్ (మహిళ), వెంకటాపురం-జనరల్ , ఊట్కూరు-ఎస్సీ (మహిళ), ఎర్రబెల్లి-జనరల్ , ఎర్ర గూడెం-జనరల్ కేటాయించారు.
గుర్రంపోడ్, నవంబర్ 23: ఆమలూరు( జనరల్,మహిళ), బ్రాహ్మణగూడెం(జనరల్, మహిళ), పాశంవారిగూడెం(జనరల్ మహిళ), తెరాటిగూడెం( జనరల్ మహిళ), ఉట్లపల్లి( జనరల్ మహిళ), బుడ్డరెడ్డిగూడెం(జనరల్), చామలేడు (జనరల్,మహిళ), కాచారం(జనరల్), మకపల్లి(ఎస్సీ,జనరల్), మైలాపురం( జనరల్), సుల్తాన్పురం ( జనరల్), వెంకటాపురం(జనరల్), ఎల్లమోనిగూడెం(జనరల్), కట్టవారిగూడెం(బీసీ మహిళ), లక్ష్మీదేవిగూడెం ( జనరల్, మహిళ), మొసంగి ( జనరల్, మహిళ), పోచంపల్లి( బీసీ మహిళ), తానేదార్పల్లి( బీసీ మహిళ), వట్టికోడు ( బీసీ మహిళ), బొల్లారం(జనరల్), చామలోనిబావి (బీసీ జనరల్), చింతగూడెం (జనరల్), గుర్రంపోడు (బీసీ,జనరల్), కాల్వపల్లి( బీసీ,మహిళ), మునీంఖాన్ గూడెం (బీసీ జనరల్), పిట్టలగూడెం( జనరల్,మహిళ), తేనేపల్లి (బీసీ జనరల్), పాల్వాయి (బీసీ జనరల్) ఘాశీరాంతండా (ఎస్టీ, జనరల్),తనేపల్లి తండా ( ఎస్టీ మహిళ), చేపూరు (ఎస్సీ మహిళ), జూనూతుల (ఎస్సీ మహిళ), కోయగూరవానిబావి ( ఎస్సీ మహిళ), జిన్నాయిచింత( ఎస్సీ జనరల్), మకపల్లి( ఎస్సీ జనరల్), నడికూడ(ఎస్సీ మహిళ)
త్రిపురారం, నవంబర్ 23: మండల పరిషత్ కార్యా లయంలో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఆదివారం సజావుగా సాగింది. 32 గ్రామపం చాయ తీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్ అన్ని పార్టీల నాయ కుల సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజ యకుమారి, సీనియర్ అసిస్టెంట్ భరద్వాజ్, నాయకులు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకటాచారి, బిట్టు రవి, అల్లంపల్లి జానయ్య, మడుపు శ్రీను, రమేశ్ పాల్గొన్నారు.
మునుగోడు రూరల్ నవంబర్ 23: మునుగోడు మండల పరిధిలోని 28 సర్పంచ్ల స్థానాలకు ఆదివారం రిజర్వేషన్లను చండూరు ఆర్డీవో శ్రీదేవి ప్రకటించారు. ఎస్సీ మహిళలు:జమస్తాన్‌పల్లి, కల్వకుంట్ల,కొంపెల్లి, ఎస్సీ జనరల్: కొరటికల్, చీకటిమామిడి,కచలపురం, బీసీ మహిళలు: రత్తిపల్లి,పలివేల, ఊకొండి, మునుగోడు, బీసీ జనరల్:బీరెల్లిగూడెం,కాశవారిగూడెం,దుబ్బగాల్వ, చల్మె, జనరల్ మహిళలు: జక్కలవారిగూడెం, ఎలుగలగూడెం, రావిగూడెం, గుండ్లొరిగూడెం, పులిపల్పుల, సింగా రం, కలవలపల్లి, జనరల్:కోతులారం, గంగోరిగూడెం, సోల్లేడు, సోలిపురం, ఇప్పర్తి, కిష్టాపురం, గూడపూర్ ఎస్సీ-6,బీసీ-8,జనరల్-14
చండూరు, నవంబర్ 23 : స్థానిక సంస్థ్ధల ఎన్నికలకు సంబంధించిన చండూరు మండలంలోని 19 గ్రామపంచాయతీ స్థానాలకు ఆదివారం చండూరు ఆర్డీవో శ్రీదేవి రిజర్వేషన్లను ప్రకటించారు.
1.బోడంగిపర్తి (ఎస్సీ మహిళ),2.శిర్ధపలి(్ల ఎస్సీ జనరల్),3.కస్తాల( ఎస్సీ జనరల్),4.నెర్మట(ఎస్సీ మహిళ), 5.కొండాపురం(జనరల్), 6.పుల్లెంల( బీసీ జనరల్),7.ఇడికూడ( జనరల్ మహిళ),8.బంగారిగడ(్డ బీసీ మహిళ), 9.దోనిపాముల( జనరల్ మహిళ, )10.తుమ్మలపల్లి (జనరల్),11.చామలపల్లి (బీసీ జనరల్),12.గుండ్రపల్లి (జనరల్ మహిళ), 13.ఉడతలపల్లి (జనరల్),14.గొల్లగూడెం(జనరల్ మహిళ), 15.జోగిగూడెం(జనరల్), 16.తిమ్మారెడ్డి గూడెం(జనరల్ మహిళ),17.చొప్పరివారిగూడెం(బీసీ జనరల్),18.పడమటితాళ(్ల జనరల్ ), 19.తాస్కానిగూడెం(బీసీ మహిళ)గా రిజర్వేషన్లను ప్రకటించామని చండూరు ఆర్డీవో తెలిపారు.
కొండమల్లేపల్లి, నవంబర్ 23 : మండలంలోని 27 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఎంపీడీవో స్వర్ణలత తెలిపారు. అంబోతుతండా (ఎస్టీ మహిళ) చెన్నంనేనిపల్లి (ఎస్సీ జనరల్), చెన్నారం (ఎస్టీ జనరల్), చింతచెట్టుతండా (జనరల్), చింతకుంట్ల (బీసీ జనరల్), దంజిలాల్‌తండా (ఎస్టీ జనరల్), దేవరోనితండా (ఎస్టీ జనరల్), దోనియాల (ఎస్సీ జనరల్), గన్యానాయక్తండా (ఎస్టీ మహిళ), గాజీనగర్ (జనరల్ మహిళ), గౌరికుంటతండా (ఎస్టీ జనరల్), గుడితండా (ఎస్టీ జనరల్), గుమ్మడవెళ్లి (ఎస్సీ మహిళ), గుర్రపుతండా (ఎస్టీ జనరల్), జానీగానితండా (ఎస్టీ మహిళ), కేశ్యాతండా (ఎస్టీ జనరల్), కొల్ముంతల్పహాడ్ (ఎస్టీ మహిళ), కొండమల్లేపల్లి (జనరల్), కొర్రోనితండా (ఎస్టీ మహిళ), కొత్తబావి (జనరల్ మహిళ), పెండ్లిపాకల (జనరల్), ఫఖీర్పురం (బీసీ మహిళ), రామావత్తండా (ఎస్టీ జనరల్), రామునిగుండ్లతండా (ఎస్టీ జనరల్), వడ్త్యాతండా (ఎస్టీ మహిళ), వర్ధమానిగూడెం (జనరల్ మహిళ)కు కెటాయించారు. దీంతో పాటు కొండమల్లేపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్‌గా ఖారారైంది. అలాగే 1, 2, 3, 6, 9, 11, 13 వార్డులు జనరల్ స్థానాలు, 1,3, 11 వార్డులు జనరల్ మహిళలు, 4,5,7,8 వార్డులు బీసీలు, 12,14 ఎస్సీలు, 10 వార్డు ఎస్టీకి కేటాయించినట్లు ఎంపీడీవో తెలిపారు.
కేతేపల్లి, నవంబర్ 24 : త్వరలో జరుగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అధికారులు ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు గత నెలలో ప్రకటించిన రిజర్వేషన్లు సవరించారు. మండలం మొత్తంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 16 గ్రామాల్లో మహిళలకు 50 శాతం కేటాయించారు. జనరల్ రిజర్వేషన్ స్థానాలు: కేతేపల్లి(జనరల్), బండలపాలెం (జనరల్), చీకటిగూడెం(జనరల్ మహిళ), చెర్కుపల్లి(జనరల్ మహిళ), ఇప్పలగూడెం(జనరల్ మహిళ), కొండకిందిగూడెం(జనరల్), కొప్పోలు (జనరల్ మహిళ), కొర్లపహాడ్(జనరల్), బీసీ రిజర్వేషన్లు: భీమారం(బీసీ మహిళ), గుడివాడ(బీసీ మహిళ), కాసనగోడు(బీసీ జనరల్), ఉప్పలపహాడ్(బీసీ జనరల్), ఎస్సీ రిజర్వేషన్ల వివరాలు: బొప్పారం(ఎస్సీ మహిళ), ఇనుపాముల(ఎస్సీ జనరల్), కొత్తపేట(ఎస్సీ మహిళ), తుంగతుర్తి(ఎస్సీ జనరల్) గ్రామాల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. 160 వార్డుల రిజర్వేషన్లు ప్రకటించారు.
కట్టంగూర్, నవంబర్ 23: మండలంలోని 22గ్రామపంచాయతీ సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం రిజర్వేషన్లు ప్రకటించారు. అయిటిపాముల, ఎరసానిగూడెం, పరడ (బీసీ జనరల్), ఈదులూరు, మల్లారం, పిట్టంపల్లి (బీసీ మహిళ), చెర్వుఅన్నారం, మునుకుంట్ల, రామచంద్రపురం(ఎస్సీ జనరల్), కల్మెర, కురుమర్తి (ఎస్సీ మహిళ), బొల్లెపల్లి, దుగినవెల్లి, గార్లబాయిగూడెం, నళ్లకుంటబోళ్లు, నారెగూడెం, పందనపల్లి (జనరల్), భాస్కర్లబాయి, ఇస్మాయిల్పల్లి, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం, పామనుగుండ్ల (జనరల్ మహిళ) గా రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
నార్కట్‌పల్లి నవంబర్ 23: నార్కట్‌పల్లి మండలం సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఆదివారం ఖరారు అయ్యాయి. మొత్తం 29 గ్రామ పంచాయతీలకు 7 ఎస్సీ రిజర్వుడు, 7 బీసీ రిజర్వుడు, 15 జనరల్ స్థానాలు ప్రకటించారు.. జనరల్ స్థానాలకు ఔరవాణి, బాజకుంట, చిప్పలపల్లి, దాసరిగూడెం, మాండ్ర, నక్కలపల్లి, షేరుబాయిగూడెం, తిరుమలగిరి గ్రామాలు. జనరల్ మహిళ స్థానాలకు అమ్మనబోలు, ఏపీ లింగోటం, చిన్ననారాయణ పురం, చౌడంపల్లి, మాద ఏడవల్లి, పోతినేనిపల్లి, ఎనుగులదోరి, బీసీ జనరల్ స్థానాలకు నార్కట్‌పల్లి, ఎల్లారెడ్డిగూడెం, కొండపాకగూడెం, నెమ్మాని, బీసీ మహిళ స్థానాలకు చిన్నతుమ్మలగూడెం, గోపాలయ పల్లి, పల్లెపహాడ్, ఎస్సీ జనరల్ స్థానాలకు అమ్మనబోలు, చెర్వుగట్టు, బ్రాహ్మణవెల్లెంల, జువ్విగూడెం. ఎస్సీ మహిళ స్థానాలు బెండల్ పహాడ్, షాపల్లి, తొండల్వాయి గ్రామాలు ఖారారు అయినట్లు అధికారులు తెలిపారు.