Rising Stars Asia Cup : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీస్‌లో భారత్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ (Bangladesh) ఏ జట్టు ఫైనల్లోనూ అదరగొట్టింది. పటిష్టమైన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను బంగ్లా బౌలర్లు కకావికలం చేసి.. స్పల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. రిప్పన్ మొండోల్(3-25, రకీబుల్ హసన్(2-16) విజృంభణతో పాక్ టాపార్డర్ కుప్పకూలింది. 64కే సగం వికెట్లు కోల్పోయిన పాక్‌ను సాద్ మసూద్(38) ఆదుకున్నాడు. డెత్ ఓవర్లో అతడు మూడేసి ఫోర్లు, సిక్సర్లు బాది పరువు కాపాడాడు. అయితే.. రిప్పన్ సూపర్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. పాక్ 125కే ఆలౌటయ్యింది.
తొలిసారి రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ ఏ టైటిల్ కొట్టేలా ఉంది. దోహాలో జరుగుత్ను ఫైనల్లో బంగ్లా బౌలర్లు.. పాకిస్థాన్‌ను వణికించి స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. ఓపెనర్ యాసిర్ ఖాన్(0) రనౌట్ కాగా.. ఫామ్‌లో ఉన్న మాజ్ సదాకత్(23)ను జిషాన్ అలామ్ బౌల్డ్ చేసి పాక్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత వచ్చిన మొహమ్మద్ ఫయీక్(0)ను మెహరూబ్ బౌల్డ్ చేయగా.. గాజీ గోరి(9)ని రకిబుల్ హసన్ డగౌట్ చేర్చాడు.
Bangladesh A need 126 Runs to win | Bangladesh A vs Pakistan Shaheens | Asia Cup Rising Stars | Final | 23 November 2025 | 8:30 PM | Doha
Photo Credit: @ACCMedia1 #Bangladesh #AsiaCupRisingStars #Cricket #BCB pic.twitter.com/4mPwJpY3tF
— Bangladesh Cricket (@BCBtigers) November 23, 2025
అంతే.. టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలగా.. అరాఫత్ మిన్హాస్(25) ఓపికగా ఆడాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా కెప్టెన్ ఇర్ఫాన్(9)తో కలిసి సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును నడిపించాడు. అయితే.. వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ కాగా.. పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 75కే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును సాద్ మసూద్(38) ఆదుకున్నాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన అతడు మూడు సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ వంద దాటించారు. కానీ, రిప్పన్ 19వ ఓవర్లో మసూద్, ఉబైద్ షాను ఔట్ చేయగా.. పాక్ 125కే ఆలౌటయ్యింది.