Kondurg : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలగూడ (Chekkalaguda)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్యూట్కారణంగా అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇల్లంతా మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనలో 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
అగ్ని ప్రమాదం కారణంగా అంజయ్య ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు పలు దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఊహించని ప్రమాదంతో తలెత్తిన నష్టాన్ని తలచుకొని అంజయ్య కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.