Telangana | నేనేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చానా.. నా పత్తి ఎందుకు కొనట్లేదు.. భువనగిరి రైతు ఆవేదన
Telangana | పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను పండించడం ఒకెత్తయితే.. ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తవుతుంది. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రైతు జహంగీర్ తన పత్తి పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
‘ రెడ్ల రేపాక నుంచి మోత్కూర్లోని ఓ కంపెనీకి రెండు ట్రాక్టర్లలో పత్తిని తీసుకుపోయాను. అక్కడికి వెళ్లిన తర్వాత నీ పత్తి అవసరమే రాదు.. నీ పత్తి పనికిరాదు అని చెప్పారు. వాళ్ల కాళ్లను పట్టుకుని బతిమిలాడితే తెలిసిందేంటంటే.. మ్యాచర్ వేసే వాడికి రెండు వేలు అడుగుతున్నారు. లోపలికి వెళ్లిన తర్వాత రెండున్నర క్వింటాళ్ల పత్తిని కట్ చేసుకుంటున్నారు. నాకు అయిన పత్తి 28 క్వింటాళ్లు అయితే.. రెండున్నర క్వింటాళ్ల పత్తిని కట్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా.. అడుక్కు తినే ప్రభుత్వమా. మేం చిప్పపట్టుకుని వెళ్లాలా?’ అని రైతు జహంగీర్ ఆవేదన చెందాడు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా పంటను అమ్ముకున్నాం. కానీ ఇప్పుడు రెండు ట్రాక్టర్లలో పత్తి తీసుకెళ్తే.. ఒక్కటే బండి పత్తి తీసుకున్నారు.. ఇంకొకటి వాపసు పంపించారని రైతు తెలిపాడు. తన ఊరి నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న ఈ కంపెనీకికు తీసుకురావడానికి ఒక్క ట్రాక్టర్కు రూ.10వేల ఖర్చు వచ్చిందన్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల కాళ్లు పట్టుకున్నా పత్తిని కొనడం లేదని.. ఈ ఖర్చు ఎవరు భరించాలని ప్రశ్నించాడు. నేను పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి.. నేనేమైనా దొంగనా? నేనేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చానా? కాళ్లు పట్టుకున్నా కానీ కనికరించలేదని తెలిపాడు. ‘రెండు వేలు తీసుకున్నాక ట్రాక్టర్ను లోపలికి పంపించారు.. అందులో రెండున్నర క్వింటాళ్ల పత్తిని కట్ చేసిండ్రు.. ఇంకో ట్రాక్టర్ను కొనలేదు. ఈ పత్తిని నేనేం చేయాలి.. ఎక్కడ పెట్టాలని’ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కాళ్లు మొక్తా.. మీరే నాకు న్యాయంచేయండి అని మాజీ మంత్రి హరీశ్రావును విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..
మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రైతు జహంగీర్ ఆవేదన ఒక్క సారి వినండి.
పత్తి కొనుగోళ్లు జరిపే విషయంలో సీసీఐ, రాష్ట్ర… pic.twitter.com/4Czq9enlJV
— Office of Harish Rao (@HarishRaoOffice) November 23, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

