సిరిసిల్ల రూరల్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని, మతోన్మాదులకు హక్కు లేదని సీపీఎం ( CPM) జిల్లా కార్యదర్శి కొడం రమణ (Kodam Ramana) పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
భాగంగా ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో అమృత్ లాల్ శుక్లా , సింగిరెడ్డి భూపతి రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా అమృత్ లాల్ శుక్లా తనయుడు శాంతి ప్రకాష్ శుక్లా , కోడం రమణ మాట్లాడారు. భూమి కోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరీ విముక్తి కోసం నైజాం నిరంకుశత్వ పాలనలో దొరలు , భూస్వాములు , పెత్తందారుల దోపిడీకి , అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టి మనుషులు చేసిన మహోత్తరమైన పోరాటమే తెలంగాణ రైతంగ సాయుధ పోరాటమని పేర్కొన్నారు.
ఈ పోరాటంతో ఇసుమంతా సంబంధం లేని బీజేపీ సెప్టెంబర్ – 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని , విమోచన , విద్రోహ దినోత్సవంగా జరుపుతూ హిందూ – ముస్లిం పోరాటంగా చిత్రీకరించి ప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేసి నాటి పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు .
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవ్వజి విమల, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , నాయకులు బెజుగం సురేష్ , మర్కంటి నర్సయ్య , కూచన శంకర్ , అన్నల్దాస్ గంగాధర్ , అక్కల శ్రీనివాస్ , జెల్ల సదానందం , అవధూత హరిదాసు , కోడం వేణు , రాంనారాయణ , పోచమల్లు , సంపత్ , నరేష్ , నాగనాథ్ , రంగయ్య తదితరులు పాల్గొన్నారు.