జై నూర్ : ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గూడమమడ గ్రామానికి చెందిన బూతింగే ఉర్మిళ (30) అనే మహిళ మూడు రోజులుగా కనిపించడం ( Woman missing ) లేదని ఆమె తల్లి బోతింగే కళాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 11న ఉదయం ఆటోలో జైనూర్ వైపు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, ఆమె ఎత్తు సుమారు 5 అడుగులు, గోరువర్ణం, తెలుపు బ్లాక్ చీర ధరించి, ఎరుపు రంగు బ్యాగ్ తీసుకొని వెళ్లిందని వివరించారు.
బంధువుల వద్ద, గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఎవరికైనా సమాచారం తెలిసినవారు వెంటనే జైనూర్ పోలీస్ స్టేషన్కు తెలియపర్చాలని జై నూర్ ఎస్సై రవికుమార్ తెలిపారు. బాధితురాలు తల్లి బోతింగే కళాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.