Electric shock | పెగడపల్లి: పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మేత మేస్తున్న రెండు గొర్రెలకు ఎర్త్ వైర్ నుండి విద్యుత్ షాక్ తగలడంతో అవి అక్కడే మృతి చెందినట్లు బాధితుడు తెలిపాడు.
మృతి చెందిన గొర్రెల విలువ రూ.30 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని పర్శ రాజయ్య కోరాడు. కాగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి కంచెను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.