IND vs PAK : ఆసియా కప్‌లో బాయ్‌కాట్ నినాదాల మధ్య మొదలైన మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇన్నింగ్స్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా బ్రేకిచ్చాడు. అతడు సంధించిన ఇన్‌స్వింగర్ ఆడబోయిన ఓపెనర్ సయీం ఆయూబ్(0) బుమ్రా చేతికి చిక్కాడు. ఆ తర్వాత బుమ్రా ఓవర్లో దూకుడుగా ఆడాలనుకున్న మొహమ్మద్ హ్యారిస్(3) అంచనా తప్పి పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. అంతే.. పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది దాయది జట్టు.
హ్యారిస్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఫఖర్ జమాన్(1) బుమ్రా ఓవర్లో ఎల్బీగా ఔట్ కావాల్సినోడు రివ్యూ తీసుకొని బతికిపోయాడు. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్ రెండు పరుగులో క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు పాక్ స్కోర్..7-2.
Owning Pakistan hardik would be the first name 🥵🗿
First ball wicket for clutch God Hardik pandya ❤️#INDvsPAK #HardikPandaya
— ARJUN 💫 (@hardiknation) September 14, 2025
టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత జట్టుకు పేసర్లు ఆదిలోనే బ్రేకిస్తూ పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా పాక్ ఓపెనర్ సయీం ఆయూబ్(0)ను వెనక్కి పంపాడు. తొలి బంతిని వైడ్ వేసిన పాండ్యా.. రెండో బంతిని ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. లెగ్ సైడ్ పడిన బాల్‌ను ఆడిన సయీం బుమ్రా చేతికి దొరికాడు. దాంతో.. ఒక్క పరుగుకే వికెట్ కోల్పోయింది పాక్. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ మొహమ్మద్ హ్యారిస్(3) వికెట్ తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.