హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్పెషాలిటీ అర్హతలున్న వైద్యులు ఏడాది నుంచి వివిధ దవాఖానల్లో విధులు నిర్వర్తిసున్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వినియోగించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేసింది.
లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా తక్షణమే వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో భర్తీ చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.