మహబూబాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హై డ్రాతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని, నిర్మాణరంగం కుదేలైందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శనివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి భరోసా ఇవ్వాలని, అలా కాకుండా భయభ్రాంతులకు గురిచేయడం వల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం కుదేలైందని ఫలితంగా అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లతో పో లిస్తే సగం కూడా జరగడం లేదని ఇందుకు హై డ్రానే ప్రధాన కారణమని తెలిపారు. మున్సిపాలిటీలో కలిసిన విలీన గ్రా మాల ప్రజల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. విలీన గ్రామాలు కలువడం వల్ల ఇంటి పన్నులు, కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు తీ సుకోవాలంటే ప్రజలు ఫీజులు తప్పక చెల్లించాల్సి వస్తున్నదని, సౌకర్యాలు వి షయానికి వచ్చేసరికి అరకొరగా ఉండడం వల్ల ఆయా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే సమస్యను ప్రభుత్వం పరిషరించాలని డిమాండ్ చేశారు.
గాంధీ పార్క్‌ను ఖాళీ చేయించాలి
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో గత ప్రభుత్వం వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, మారెట్లు నిర్మించి ప్రారంభించిందని, అయితే తాతాలికంగా గాంధీ పారులో చిరు వ్యాపారులు ఉన్నారని వారిని వెంటనే ఖాళీ చేయించి కొత్తగా నిర్మించిన మారెట్లోకి పంపాలని ఆయన కోరారు. గతంలో ఇదే విషయమై కలెక్టర్‌కు విన్నవించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారిని కొత్త మారెట్లోకి పంపాలని విజ్ఞప్తి చేశారు.