కాచిగూడ, జనవరి 13: దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో వివిధ రాష్ర్టాల బీసీ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5,6 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
బీసీలకు మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందని, కేంద్రం తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, సుధాకర్, నందగోపాల్, కోట్ల శ్రీనివాస్, రామకృష్ణ, రాజేందర్, రాజేందర్, ఉద య్, లింగయ్యయాదవ్, రాందేవ్, మల్లేశ్, కృష్ణయాదవ్, రాజేశ్ పాల్గొన్నారు.