Jailer 2 | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)-కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే ప్రాజెక్ట్ జైలర్. ఇటీవల కాలంలో వచ్చిన తలైవా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది జైలర్. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రానికి కొనసాగింపుగా జైలర్ 2 (Jailer 2) వస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2 ప్రొడక్షన్ దశలో ఉంది.
కాగా చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించిన వార్త ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇటీవలే చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు తలైవా. ఇంతకీ మరి రజినీకాంత్ వెళ్లిందెక్కడికో తెలుసా..? జైలర్ 2 షూటింగ్ కోసమే కేరళ వెళ్లాడట. జైలర్ అప్డేట్ గురించి అడగగా.. షూటింగ్ కొనసాగుతోంది. గత ఆరు రోజుల్లో కేరళ షెడ్యూల్ నడుస్తుందని చెప్పాడు. అంతేకాదు 2026 జూన్ తర్వాతే జైలర్ 2 విడుదల ఉంటుందని కూడా అన్నాడు తలైవా. ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు తలైవా అభిమానులు.
జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించగా.. మరి సీక్వెల్లో ఎవరెవరు మళ్లీ కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఇటీవలే తలైవా నటించిన కూలీ విడుదల కాగా మంచి వసూళ్లు రాబట్టింది.
Mirai | మిరాయ్’లో శ్రీరాముడిగా నటించింది ఎవరో తెలుసా? ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్!
OG | ఓజీ పిల్లర్స్ ఒకే ఫ్రేములో.. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ ట్వీట్