బీఆర్ఎస్ హయాంలోనే జుక్కల్ అబివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అబివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
- పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
- పిట్లంలో పార్టీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
నిజాంసాగర్, ఫిబ్రవరి 24: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అబివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు, గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ముఖ్యంగా నిజాంసాగర్ నుంచి సాగునీరు అందించేందుకు రూ.476 కోట్ల వ్యయంతో నాగమడుగు మత్తడి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వల్లే నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించామని, ఇంతవరకూ ఏ ఒక్క మండలంలో పనులు పూర్తికాలేదని ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే, వారి జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు మాట్లాడుతూ..కాంగ్రెస్ ఏ ఒక్క హమీని అమలు చేయడం లేదని అందుకే ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు.
కార్యకర్తల్లో ఫుల్ జోష్
సమావేశానికి ఊహించిన దానికన్నా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పుల్ జోష్‌తో తరలివచ్చారు. జై కేసీఆర్ అంటూ నినాదాలతో ఫంక్షన్ హాల్ మార్మోగింది. ముందుగా మండలానికి ఒకరిద్దరు చొప్పున వివిధ వర్గాల నుంచి కార్యకర్తలు మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు వెంకట్రాంరెడ్డి, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వాసరీ రమేశ్, జొన్న శ్రీనివాస్‌రెడ్డి, జంబిగ హన్మాండ్లు, నర్సాగౌడ్, లక్ష్మన్‌యాదవ్, దుర్గారెడ్డి, మోహన్‌రెడ్డి, వాజిద్‌అలీ, నర్సింహారెడ్డి, మనోహర్, రమేశ్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, రాజు, వెంకట్రావ్దేశాయ్, రౌతువార్ కృష్ణ తో పాటు ఆయా మండలాల నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

