BRS | మైలార్‌దేవ్‌పల్లి, ఫిబ్రవరి 19: భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌కు చెందిన 200 మందికి పైగా కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్.వెంకటేష్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 24 గంటల విద్యుత్ ఉండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంధకారం అలుముకుందని చెప్పారు. రైతు భరోసా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు వంటి అనేక పథకాలను పేదల సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా 6 గ్యారెంటీ హామీలును గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రోజు రోజుకు బలమైన శక్తిగా ఎదుగుతున్నదన్నారు. పూర్వవైభవం తెచ్చుకుంటూ పార్టీ ముందుకు పురోగమిస్తున్నదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారన్నారు. కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్.వెంకటేష్, సర్వర్, వహజ్, ఫారుఖ్, మోహిన్, ఖాన్, రాముయాదవ్, రాఘవేందర్‌యాదవ్, రవి, ఈశ్వర్, వెంకటేష్, రాజు, చిరంజీవి, రాజ్‌కుమార్, అశోక్‌కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.