LSG vs RR : పదిహేడో సీజన్లో మరో కీలక సమరానికి కాసేపట్లో తెరలేవనుంది. హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants)లు హోరాహోరీగా తలపడనున్నాయి.
లక్నో గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో గెలిపించిన స్టోయినిస్, ఓపెనింగ్ జోడీ డికాక్, రాహుల్‌లు మరోసారి చెలరేగితే లక్నో భారీ స్కోర్ కొట్టడం ఖాయమే.
లక్నో తుది జట్టు : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయూష్ బదొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), రొవ్‌మాన్ పావెల్, హెట్‌మైర్, జురెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.