Shane Watson | టీమిండియా కోచ్‌గా చేస్తా!.. ఒక్క చాన్స్ ఇస్తారా..?
Shane Watson : మాజీ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్(Shane Watson) తన కోచింగ్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవకాశం రావాలేగానీ భారత జట్టుకు కోచ్(Team India Coach)గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని వాట్సన్ అన్నాడు.
Shane Watson : మాజీ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్(Shane Watson) తన కోచింగ్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న వాట్సన్.. అవకాశం రావాలేగానీ భారత జట్టుకు కోచ్(Team India Coach)గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.
తాజాగా ది ఫెడరల్ పత్రికతో వాట్సన్ మాట్లాడాడు. ‘నాకు కోచింగ్ ఇవ్వడమంటే ఇష్టం. అందులో ఏ సందేహం లేదు. రికీ పాంటింగ్‌కు తోడుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేస్తున్నా. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL), మేజర్ లీగ్ క్రికెట్ (MLS)లోనూ కోచ్‌గా సేవలందించాను. భవిష్యత్తులో అవకాశం రావాలే గానీ భారత జట్టుకు కోచ్‌గా పని చేస్తా. ఎందుకంటే గొప్ప ఆటగాళ్లతో పనిచేయాలనేది నా ఆలోచన. అందుకు టీమిండియా బాగా సరిపోతుంది’ అని 42 ఏండ్ల వాట్సన్ తెలిపాడు. ఈ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ పాకిస్థాన్ కోచ్ పదవి రేసులో ఉన్నాడనే వార్తలు వినిపించాయి. అయితే.. వాట్సన్ మాత్రం పాక్ జట్టుకు కోచ్‌గా వెళ్లేందుకు ఇష్టపడలేదు.

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌తో హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవి కాలం ముగియనుంది. లెక్క ప్రకారం నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌తోనే ద్రవిడ్ బృందం కాంట్రాక్ట్ ముగిసింది. కానీ, టీమిండియా ఆసియా కప్(Asia Cup 2023) గెలవడం, వరల్డ్ కప్ ఫైనల్ వెళ్లడంతో ద్రవిడ్ టీమ్‌పై నమ్మకముంచిన బీసీసీఐ వాళ్ల కాంట్రాక్ట్‌ను పొట్టి ప్రపంచ కప్ వరకూ పొడిగించింది. ఒకవేళ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఫైనల్ చేరితే జూన్ 29తో కోచ్‌గా ద్రవిడ్ కాలపరిమితి ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కోచ్ ఎంపికకు దరాఖాస్తులు ఆహ్వానిస్తారా? లేదా అతడినే కొనసాగిస్తారా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
- donkey’ flight | భారతీయులున్న దుబాయ్ విమానం.. జమైకా నుంచి తిరిగి వెనక్కి
- SBI Q4 Results | అంచనాలు బ్రేక్ చేసిన ఎస్బీఐ.. మార్చి త్రైమాసికంలో 24 శాతం పెరిగిన నికర లాభం..!
- Loksabhs Elections 2024 | జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కనుమరుగు : సాధ్వి నిరంజన్ జ్యోతి
- Special Buses | ఏపీ ఓటర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

