Mathu Vadalara 2 | ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’. బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైం కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సరిగ్గా ప్రమోషన్స్ అవ్వట్లే అని క్రియేటివ్‌గా ఒక వీడియోను వదిలింది చిత్రయూనిట్. అయితే ఈ వీడియోలో మత్తు వదలరా 2 ప్రమోషన్స్‌తో పాటు మహేశ్ – రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాపై కూడా హింట్ ఇచ్చారు. ఇక ఆ అప్డేట్ ఏంటో మీరు చూసేయండి.
The Pride of Indian Cinema for the most hilarious gang of Telugu Cinema ❤️🔥@ssrajamouli X #MathuVadalara2 🤩
▶️ https://t.co/ZNa7mVHbWFIn cinemas on 13th September, 2024 ✨
Book your tickets now ❤🔥
🎟️ https://t.co/2KCkNRS08mA @RiteshRana sequel.#MV2 @Simhakoduri23… pic.twitter.com/CVpsA6R5K7
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2024
also read..