భోపాల్: ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్లు భయాందోళనకు గురి చేస్తుండగా మధ్యప్రదేశ్‌లో నక్కలు చెలరేగిపోతున్నాయి. గ్రామంలోని రోడ్డు పక్కన కూర్చొన్న ఇద్దరు వ్యక్తులపై ఒక నక్క దాడి చేసింది. (Jackal Attacks Men) అయితే దాని బారి నుంచి తప్పించుకునేందుకు వారిద్దరూ చాలా పోరాడారు. ఒక వ్యక్తి ఆ నక్కను ఎత్తి దూరంగా విసిరేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 9న సాయంత్రం వేళ సగోనియా గ్రామంలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక నక్క వేగంగా వారి వద్దకు వచ్చింది. తొలుత ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. స్పందించిన మరో వ్యక్తి ఆ నక్కను బెదరగొట్టేందుకు రాళ్లు విసిరాడు. అది అతడి మీదకు దూసుకొచ్చింది. అయితే దాడి చేసిన నక్కను ఆ వ్యక్తి సుమారు 15 అడుగుల దూరంలోకి విసిరేశాడు. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, నక్క దాడిలో గాయపడిన వ్యక్తులను శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌గా గుర్తించారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నక్క దాడిపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश में भेड़िया तो MP में सियार का आतंक…
– CCTV में कैद हुआ हमले का वीडियो.
– अब तक 6 लोगों को किया जख्मी.
– घटना एमपी के सीहोर जिले की.#UttarPradesh #MadhyaPradesh #Sehore #Attack #Nedricknews pic.twitter.com/uexJT8ErAE— Nedrick News (@nedricknews) September 10, 2024