Rain Alert | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరికాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇక వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి వర్షంలోనే తడిచిపోయారు. నిన్న అత్యధికంగా షేక్‌పేటలో 10.6 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, శ్రీనగర్ కాలనీలో 10.0, ఖైరతాబాద్ సెస్ వద్ద 9.0, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 8.2, మైత్రివనం 6.9, ముషీరాబాద్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 6.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
కాగా, గడిచిన 24గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు -ఎంలో 14.26 సెం.మీ, ఆత్మకూరులో 9.71 సెం.మీ, మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 11.13 సెం.మీ, మహబూబాద్ జిల్లా పెద్దవంగరలో 9.59 సెం.మీ, జనగామ జిల్లా దేవరుప్పలలో 9.34 సెం.మీ, వికారాబాద్ జిల్లా కులకచర్లలో 8.94 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు
వెల్లడించింది.