Katrina kaif – Vikcy Kaushal | బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని కత్రినా కైఫ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కొన్ని నెలలుగా కత్రినా గర్భవతి అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ.. కత్రినా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. విక్కీ కౌశల్‌తో కలిసి బేబి బంప్ ఫొటోని షేర్ చేసింది. ‘మా జీవితంలో అత్యంత అందమైన అధ్యాయాన్ని సంతోషం, కృతజ్ఞతతో ప్రారంభిస్తున్నాము’ అని ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది ఈ జంట. ఇక ఈ పోస్ట్‌కి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.