హైదరాబాద్ : తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార ఫెడరేషన్ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ వారి 2026 డైరీని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టాఫ్ వర్కర్స్ యూనియన్ సభ్యులకు మంత్రి వాకిటి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రావిర్యాలలోని మెగా డెయిరీని సందర్శించాలని యూనియన్ సభ్యులు కోరగా.. త్వరలో వస్తానని మంత్రి తెలిపారు. అయితే రైతులకు రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చేలా బడ్జెట్లో నిధులు కేటాయించాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంత్రిని కోరారు. కాగా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, జనరల్ సెక్రెటరీ బాల్ ప్రసాద్, ట్రెజరరీ నిఖిల్, ఆనంద్, శ్రీధర్, రాజు, ఈశ్వర్, సతీష్, కరీమ్, శరత్‌లు పాల్గొన్నారు.