Reservation : లేటరల్ ఎంట్రీ ద్వారా ఉన్నతోద్యోగాల భర్తీ వ్యవహారంపై కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా రిజర్వేషన్లకు మోదీ సర్కార్ తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టాయి. సర్కార్ వైఖరి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడేనని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి బహుజనుల నుంచి రిజర్వేషన్లను లాగేసుకోవాలని బీజేపీ కోరుకుంటున్నదని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌లో మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. దేశ రిజర్వేషన్ విధానానికి ఇది వ్యతిరేకమని లేటరల్ ఎంట్రీని మరో కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇది దేశ పరిపాలనా వ్యవస్ధకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఇది దేశ రిజర్వేషన్ వ్యవస్ధకూ విఘాతమని ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం తీరును తీవ్రంగా ఆక్షేపించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయాన్ని దేశానికి వ్యతిరేకంగా కేంద్రం చేపట్టిన భారీ కుట్రగా అభివర్ణించారు. లేటరల్ ఎంట్రీ దళితులు, ఓబీసీలు, మైనారిటీల నుంచి రిజర్వేషన్లను లాగేసుకునేందుకేనని ఆయన ఆరోపించారు.
Read More :
Raksha Bandhan | రాఖీపండుగ సందర్భంగా చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం.. Video