PM Modi | నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు (Birthday). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. వారితోపాటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర దేశాధినేతలు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి (Vice president of India) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.
Also Read..
PM Modi | మోదీ బర్త్డే.. 750 తామర పువ్వులతో పూరీ తీరంలో ప్రత్యేక సైకత శిల్పం
Modi Birthday Campaign | బలవంతపు బర్త్డే విషెస్.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ప్రధాని మోడీ
PM Modi | ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి