Caps Gold | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున క్యాప్స్ గోల్డ్ కంపెనీ గోల్డ్ కొనుగోలు చేస్తుంది. ఆ బంగారాన్ని రిటైల్ గోల్డ్ షాప్స్‌కు క్యాప్స్ గోల్డ్ కంపెనీ విక్రయిస్తుంది. ఈ క్రమంలో క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్‌సేల్‌గా ఉన్న సంస్థల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డట్టు గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.