Modi Birthday Campaign | నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ శుభాకాంక్షలు సెలబ్రిటీలతో బలవంతంగా పెట్టించారని ఇది ఒక రకమైన ఒత్తిడి రాజకీయమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కేవలం ట్వీట్లు, పోస్టులకే పరిమితమైన సెలబ్రిటీలు ఈసారి ఏకంగా వీడియోలను విడుదల చేసి మరీ శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా ‘MyModiStory’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే ఈ పోస్టులు ఒకే తరహాలో ఒకే సమయంలో రావడంపై కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని పోస్టులలో బీజేపీ అధిష్టానం పంపిన ఫార్వర్డ్ మెసేజ్‌లను కాపీ-పేస్ట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనితో ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కనపెట్టి పబ్లిసిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాలనను గాలికి వదిలేసి ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఆరోపణలపై అధికారికంగా ఎవరూ స్పందించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Modi ke janamdin se pahle unka paid promotion ho raha hai .#MyModiStory pic.twitter.com/sjtLGtXgjU
— Surbhi (@SurrbhiM) September 16, 2025
BJP is running North Korea level propaganda for Modi’s 75th Birthday #MyModiStory pic.twitter.com/xJaE0F7N7w
— Veena Jain (@Vtxt21) September 17, 2025
I used to be on a BJP-affiliated WhatsApp group where one day a Google document was shared. It contained a bank of tweets for different people to post. Since the document was public, I was able to edit it and make small changes, like turning “Working for middle… https://t.co/68K4cXRvJU
— Pratik Sinha (@free_thinker) September 17, 2025